Header Banner

తిరుమల కిటకిట! జూన్ లో శ్రీవారికి నిర్వహించబోయే విశేష ఉత్సవాలు ఇవే!

  Tue May 27, 2025 08:00        Devotional

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు ఏకంగా 91,538 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 37,339 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వేస‌వి సెల‌వుల కార‌ణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాల్లో 1,81,749 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేసవి సీజన్ లో ఇదే అత్యధికం. అంతకుముందు రెండు రోజులను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 3,28,702కు పెరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 10,98,170 మంది భ‌క్తుల‌కు టీటీడీ అన్న ప్ర‌సాదాలు అందించింది.

4,55,160 మంది భ‌క్తుల‌కు టీ/కాఫీ/పాలు/మ‌జ్జిగను సరఫరా చేసింది. ఈ నాలుగు రోజుల్లో 1,52,587 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. 12,172 మంది భ‌క్తులు వైద్య సేవ‌లు పొందారు. కాగా- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో నిర్వహించబోయే విశేష ఉత్సవాలు, ప‌ర్వదినాల వివ‌రాలను టీటీడీ వెల్లడించింది. ⁠జూన్ 5వ తేదీన మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రంతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభంతో ముగుస్తాయి.

9వ తేదీన శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమౌతుంది. అదే రోజున న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌ నిర్వహిస్తారు. ⁠11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు పరిస‌మాప్తమౌతాయి. 21న స్మార్త ఏకాద‌శి, 22న వైష్ణ‌వ మధ్వ ఏకాద‌శి కార్యక్రమాలను టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 26న పెరియాళ్వార్ ఉత్స‌వం ఆరంభమౌతుంది.

టీటీడీ రూ.11 లక్షల విరాళం..
అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగ‌నాథ్‌, కృష్ణ కుమారి దంప‌తులు సోమ‌వారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు 10 ల‌క్ష‌లు, ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు ల‌క్ష‌ రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని టీటీడీ ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో బీఆర్‌ నాయుడుకు ఈ మొత్తంతో కూడిన డీడీల‌ను అంద‌జేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirumala #TirupatiBalaji #JuneUtsavams #TirumalaUpdates #SrivariUtsavams #TTDNews #DevotionalFestivals